సాయి ధరమ్ -కిషోర్ తిరుమల కొత్త సినిమా విశేషాలు !

Published on May 29, 2018 12:38 am IST


సాయిధరమ్ తేజ్ నటించిన నూతన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ ‘ విడుదలకు రెడీ అవుతుంది .ఈ సినిమా తరువాత సాయి ధరమ్ ‘నేను శైలజా ,ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమల తెరకేక్కిన్చనున్న చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమా తండ్రి కొడుకుల రిలేషన్ షిప్ ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం .

ఈ చిత్ర టైటిల్ కి ‘చిత్రలహరి’ అనే పేరును పరిశీలిస్తున్నారు . అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది .తన ప్రతి సినిమాలో ఎమోషన్స్ ని బాగా చూపించే కిశోర్ ఈ చిత్రాన్ని ఏవిధంగా తెరకెక్కిస్తారో చూడాలి . ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు చిత్ర యూనిట్ .

సంబంధిత సమాచారం :