లాయర్ గా సాయి ధరమ్ తేజ్ !

Sai Dharam Tej

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల తన కొత్త చిత్రం చిత్రలహారి షూటింగ్ ను పూర్తి చేశాడు. ఇటీవల వరుస పరాజయాలను చవిచూసిన తేజు ఈ చిత్రం ఫై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఏప్రిల్ 12 న విడుదలకానుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం తరువాత ఈ హీరో మారుతీ దర్శకత్వంలో నటించనున్నాడు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఈ చిత్రంలో సాయి ధరమ్ లాయర్ గా నటించనున్నాడని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే లాంచ్ కానుంది. ఈ చిత్రంలో సాయి కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఒకవేళా అదే జరిగితే వీరిద్దరి కి ఇది రెండో సినిమా కానుంది. ఇంతకుముందు ఈ జోడి విన్నర్ లో కలిసి నటించారు.

Exit mobile version