మొదటిరోజు అనుభవం భలేవుందంటున్న యంగ్ హీరో

Published on Jun 29, 2019 7:54 am IST

సాయి ధరమ్ తేజ్ రొమాంటిక్ కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో “ప్రతిరోజూ పండగే” చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాశి ఖన్నాహీరోయిన్ గా ధరమ్ సరసన నటిస్తుంది. నిన్న ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ హైద్రాబాద్లో ప్రారంభమైంది. మొదటి రోజు “ప్రతిరోజూ పండగే” చిత్ర షూటింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది అని తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఈ యంగ్ హీరో.

కాగా యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ, ప్రమోద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో విజయకుమార్, రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More