
ఇటీవలే వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాతో యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సూపర్ హిట్ ని అందుకున్నాడు. అంతే కాకుండా ఒకప్పటి మెగాస్టార్ ‘సుప్రీమ్ హీరో’ అనే ట్యాగ్ లైన్ ని కూడా తగిలించుకున్నాడు. అది ఏ నిమిషాన పెట్టుకున్నారో గానీ ఇప్పుడు అదే టైటిల్ తో సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ యాడాది పటాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా సెప్టెంబర్ 23న పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. మొదటి షెడ్యూల్ ని ఈ రోజు ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేసారు. నవంబర్ మిడిల్ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగనుంది. సాయిధరమ్ తేజ్ ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్న ఈ సినిమాకి ‘డోంట్ సౌండ్ హార్న్’ అనేది ఉపశీర్షిక. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ తో దిల్ రాజు చేస్తున్న మూడవ సినిమా ఇది. దీని తర్వాత కూడా వెంటనే మరో సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందించనున్నాడు.

