మెగా యంగ్ హీరోస్ లో ఒకరైన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా దర్శకుడు రోహిత్ కే పి తెరకెక్కిస్తున్న భారీ స్కేల్ చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ కోసం అందరికీ తెలిసిందే. సాయి తేజ్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమా తన కెరీర్ లోనే అత్యంత బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా గత కొన్నాళ్ల నుంచి సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది.
అయితే లేటెస్ట్ గా ఓ సాలిడ్ అప్డేట్ దీనిపై వినిపిస్తుంది. ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు కాంబినేషన్ లో మేకర్స్ ఓ కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా ముంబైలోనే షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అక్కడ కూడా భారీ స్కేల్ లో ఈ షెడ్యూల్ ని పూర్తి చేసినట్టుగా టాక్. అలానే దాదాపు ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని సమాచారం. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య లెక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా హను మాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


