సాయి కుమార్ కి పితృ వియోగం

PJ-Sarma
డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన సాయి కుమార్ తండ్రి అయిన పిజే శర్మ ఈ రోజు కన్ను మూశారు. నిన్న సాయంత్రం కూడా ఆది రిసెప్షన్ లో పాల్గొన్న పిజే శర్మ కి సడన్ గా గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. దాంతో నిన్ననే శుభకార్యం జరిగిన ఆనందంలో ఉన్న ఈ కుటుంబం మొత్తం ఒక్కసారిగా శోఖ సముద్రంలో మునిగిపోయింది.

పిజే శర్మ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలలో నటించారు. ఆయన సుమారుగా 500కి పైగా సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఎంతో మంది ప్రముఖులకి ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు. ఆయన బాటలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి కుమార్, రవి శంకర్, అయ్యప్ప శర్మలు కూడా డబ్బింగ్ లో రాణించారు. సాయి కుమార్ ఫ్యామిలీకి కుటుంబ పెద్ద అయిన పిజే శర్మ కన్ను మూయడంతో కుటుంబం అంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకి ఎర్రగడ్డ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

పిజే శర్మ హఠాన్మరణంతో శోఖ సముద్రంలో మునిగిపోయిన సాయి కుమార్ కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.