గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకుపోతుంది. బాలయ్య పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా, డివోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రం NBK111 ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా కథను అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై బజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, తాజాగా ఈ సినిమాపై సాయి మాధవ్ బుర్రా ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
NBK111 చిత్రం సాధారణ చిత్రం కాదని.. ఇందులోని సబ్జెక్ట్ స్థాయి వేరని ఆయన అన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ షాక్ అవ్వడం ఖాయమని.. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి గర్వపడతారని ఆయన తెలిపారు. ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు అని అందరూ భావించేలా NBK111 ఉండబోతుందని సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాపై అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. దీంతో అసలు ఈ సినిమా ఎలాంటి కథతో రానుంది.. ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి విధ్వంసం చేయబోతున్నాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.


