‘కణం’ ఒక ఎమోషనల్ జర్నీ – సాయి పల్లవి
Published on Feb 24, 2018 5:34 pm IST

సెన్సేషనల్ హీరోయిన్ సాయి పల్లవి తన మాతృ భాష తమిళంలో ‘కారు’ చిత్రంతో ఆరంగేట్రం చేయనుంది. ఈ చిత్రం తెలుగులో ‘కణం’ పేరుతో రానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు మార్చి9న విడుదలచేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే చిత్ర యూనిట్ తమిళ వెర్షన్ యొక్క ఆడియో వేడుకను ఈరోజు నిర్వహించారు.

ఈ వేడుకలో మాట్లాడిన సాయి పల్లవి ఈ చిత్రం ఒక ఎమోషనల్ జర్నీ అని, గొప్ప అనుభూతినిచ్చే చిత్రమని అన్నారు. భ్రూణ హత్యల నైపథ్యంలో నడిచే ఈ చిత్రం హర్రర్ డ్రామాగా ఉండనుంది. తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాగ శౌర్య హీరోగా నటించాడు. ఎన్వీఆర్ సినిమాస్ అధినేత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సమర్పించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని మొదటి తెలుగు పాట రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది.

 
Like us on Facebook