‘చైతు – సాయిపల్లవి’లది ‘లవ్ స్టోరీ’నే !

‘చైతు – సాయిపల్లవి’లది ‘లవ్ స్టోరీ’నే !

Published on Jan 14, 2020 7:13 PM IST

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకి ‘లవ్ స్టోరీ’ అని టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ఈ రోజు అధికారికంగా పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రకటించింది. అయితే ఈ సినిమాకి ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ను పెట్టబోతున్నట్లు మేం గతంలోనే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే ఈ సినిమాకి లవ్ స్టోరీ అని టైటిల్ నే ఫిక్స్ చేశారు.

ఇక ఏప్రిల్ 2న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. బలమైన కథలతో సినిమాలు తీసే డైరెక్టర్ గా మంచి పేరు ఉన్న శేఖర్ కమ్ముల.. ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది.

కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు