ఈ సాంగ్ తో సాయి పల్లవి కాంబో మళ్ళీ మ్యాజిక్ చేస్తారా.?

Published on Feb 28, 2021 5:30 pm IST

తెలుగులో తన మొట్ట మొదటి సినిమాతోనే ఎనలేని క్రేజ్ ను తెచ్చుకుంది సాయి పల్లవి. ఒక్క నటన పరంగానే కాకుండా మైండ్ బ్లోయింగ్ డాన్సర్ గా కూడా సాయి పల్లవికి మంచి పేరు ఉంది. మరి అలా తన మొదటి సినిమా “ఫిదా”లో ఓ సెన్సేషనల్ హిట్ ట్రాక్ తో అదరగొట్టిన సాయి పల్లవి మళ్ళీ అదే కాంబోలో వస్తుంది. టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్లాన్ చేసిన చిత్రం “లవ్ స్టోరీ”.

ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి కూడా మంచి అంచనాలతో ఉంది. వాటిని మరింత ఎక్కువ చేసుకుంటూ కూడా వచ్చింది. అయితే మరియు ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సాంగ్ ను ఇప్పుడు విడుదల చేసారు. పవన్ సి హెచ్ స్వరాలూ అందించగా సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.

పక్కాగా ఫీమేల్ ఓరియెంటెడ్ సాంగ్ గా ఫిదా లోని “వచ్చిండే” టైప్ లో దీనిని కూడా ప్లాన్ చేశారు. అయితే అదే సాంగ్ కు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నే కొరియోగ్రాఫ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా చేశారు పైగా దీనికి కూడా సంగీత ప్రియులు నుంచి మంచి మౌత్ టాక్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి సాయి పల్లవి – శేఖర్ మాస్టర్ – కమ్ముల ల కాంబో నుంచి వచ్చిన ఈ సాంగ్ ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :