అనుకోని అతిథిగా రానున్న సాయి పల్లవి

Published on Oct 8, 2019 8:37 am IST

నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అథిరన్’ తెలుగులో ‘అనుకోని అతిథి’గా విడుదల చేయనున్నారు. 2019 ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫహాద్ ఫైజల్ హీరోగా ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ గా దర్శకుడు వివేక్ తెరకెక్కించాడు. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని ఇంట్రోపీ ఫిలిమ్స్ బ్యానర్ పై అన్నపురెడ్డి కృష్ణ కుమార్ మరియు గోవింద రవి కుమార్ నిర్మిస్తున్నారు.

నేడు దసరా సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. మూవీ విడుదల ఎప్పుడనేది ఇంకా ప్రకటించాల్సి వుంది. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సస్పెన్సు థిల్లర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల సూర్య హీరోగా వచ్చిన ఎన్ జి కె చిత్రంలో సాయి పల్లవి గృహిణి పాత్రలో అలరించింది. ఇక ఈమె రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నాగ చైతన్య శేఖర్ కమ్ముల మూవీలో కూడా హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపికైన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More