మీరా పాత్రలో సాయి పల్లవి !

మీరా పాత్రలో సాయి పల్లవి !

Published on Aug 21, 2018 11:21 PM IST

యువ కథానాయిక సాయి పల్లవి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘ఎన్ జి కె’ చిత్రంలో నటిస్తుందని తెలిసిందే. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మీరా అనే యువతి పాత్రలో నటిస్తుంది సాయి పల్లవి. పొలిటికల్ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మరో కథానాయికగా నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో దీపావళి కి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక సాయి పల్లవి ఈ చిత్రం తో పాటు ధనుష్ తో ‘మారి 2’ అలాగే తెలుగులో శర్వానంద్ తో పడి పడి లేచె మనుసు చిత్రాల్లో నటిస్తుంది. ఈరెండు కూడా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులముందుకు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు