ఆ విషయంలో నాదే తప్పంటున్న సాయి పల్లవి.

Published on May 31, 2019 8:00 pm IST

సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కాంబినేషన్లో టాలెంట్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ “ఎన్ జి కె”. ఈ మూవీ భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నెటిజన్లతో చిట్ చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోవాలని సాయిపల్లవి భావించింది. అందుకు టైమ్ ను కూడా ఫిక్స్ చేసి అభిమానులకు తెలియపరిచింది.

అయితే కొన్ని కారణాల వలన ఆమె అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దాంతో నిరాశకి లోనైన నెటిజన్లు సాయిపల్లవి ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘మా సమయం వృథా చేసుకుని నీతో చాటింగుకి వెయిట్ చేస్తుంటే నువ్వు చీటింగ్ చేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. దాంతో సాయిపల్లవి నెటిజన్లకు ‘సారీ’ చెప్పేసింది. ‘మరోసారి ఎప్పుడైనా సోషల్ మీడియాలో కలుద్దాం’ అంటూ కూల్ చేసింది. నెటిజన్స్ తో పెట్టుకుంటే అంతే మరి.

సంబంధిత సమాచారం :

More