మరోసారి సాయి పల్లవి మాస్ చూపించింది.!

మరోసారి సాయి పల్లవి మాస్ చూపించింది.!

Published on Mar 2, 2021 2:00 PM IST

ఇటీవల కాలంలో ఒక సినిమా రిజల్ట్ ను ఆ సినిమా తాలూకా మ్యూజిక్ ఆల్బమే సగం డిసైడ్ చేసేస్తోంది. కనీసం అందులో ఒక్కటి సాలిడ్ హిట్ ట్రాక్ ఉన్నా అంతే సంగతి. మరి అలాంటి హిట్ ట్రాక్స్ ఇవ్వడంలో దిట్ట అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల చేస్తున్న లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ” నుంచి వచ్చిన సాంగ్ అంతే స్థాయిలో సెన్సేషన్ ను సృష్టిస్తుంది.

ఆ మధ్య “ఫిదా”లో ఈ కాంబో ఎంత పెద్ద ట్రేడ్ మార్క్ సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానిలానే వీరి నుంచి వచ్చిన “సారంగ దరియా” బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి రెండు రోజుల కితమే ఈ సాంగ్ ను మేకర్స్ విడుదల చెయ్యగా మళ్ళీ సాయి పల్లవి తన మాస్ ను చూపించింది.

విడుదల టైం లోనే ఈ కాంబో ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తుంది అనుకున్నాం కానీ ఇంకాస్త ఎక్కువే చేసింది అని చెప్పులు. కేవలం రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ కొల్లగొట్టడమే కాకుండా యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతుండడంతో ఇప్పుడు సినీ వర్గాల్లో మళ్ళీ సాయి పల్లవి పేరు మారుమోగుతోంది. అలాగే ఇలాంటి మాస్ సాంగ్ ను పాడిన మంగ్లీకు మరింత పేరు వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు