‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఆ తర్వాత వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంలో కూడ నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించిన సాయి పల్లవి ఇకపై కూడ అలాంటి పాత్రల్ని, కథల్నే ఎంచుకుంటానని గతంలోనే చెప్పారు. అలా కథ, పాత్ర విషయంలో ఖచ్చితంగా ఉండే సాయి పల్లవి కొత్త సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తోంది.
తొలి చిత్రం ‘నీది నాది ఒకే కథ’తో ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని మెప్పించిన దర్శకుడు వేణు ఊడుగుల ప్రస్తుతం రెండవ సినిమా పనుల్లో ఉన్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయి ప్రేమ కథగా ఉండనుంది. ఈ చిత్రం కోసం వేణు సాయి పల్లవిని సంప్రదించి కథ వినిపించారని, సాయి పల్లవి కూడ సినిమాకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో హీరో ఎవరనే సంగతి తెలియాల్సి ఉంది.


