సాయి శ్రీనివాస్ కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్ !

Published on Apr 4, 2019 11:35 am IST

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్. అందులో భాగంగా ఇప్పుడు ఓ సూపర్ హిట్ తమిళ చిత్రాన్ని నమ్ముకున్నాడు. గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అయిన కోలీవుడ్ మూవీ ‘రాక్షసన్ ‘ తెలుగులో రీమేక్ లో నటిస్తున్నాడు సాయి శ్రీనివాస్. ఇక తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రాక్షసుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఏ స్టూడియోస్ బ్యానేర్ ఫై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ నెలలో సాయి శ్రీనివాస్ ‘సీత’ అనే చిత్రం తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.

సంబంధిత సమాచారం :