హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ నుండి నిన్న కొన్ని కొత్త స్టిల్స్ బయటికొచ్చాయి. వాటిలో తేజ్ హీరోయిన్ రాశీఖన్నా భుజంపై చేయి వేసిన పోజులు ఉన్నాయి. వాటిని చూసిన రాశీఖన్నా ఫ్యాన్స్ మా హీరోయిన్ మీద చేయి వేస్తావా.. చేయి తీ, హాత్ నికాలో అంటూ కామెంట్స్ పెట్టారు. ఇవన్నీ సరదాగా చేసినవే. తేజ్ కూడా వాటిని సరదాగానే తీసుకున్నాడు. అలాగే సమయస్పూర్తితో ఆలోచించి వాటిని ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం వాడాడు.
ఈమధ్య జరిగిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యా ఉదంతాన్ని ప్రస్తావించి మీ ఫేవరెట్ హీరోయిన్ మీద చేయి వేస్తే అది సినిమాలో భాగమని తెలిసినా చేయి తీయమన్నారు.. మన చుట్టూ ఉన్న అమ్మాయిల్ని కూడా ఇంతే ప్రేమగా, భాద్యతగా చూసుకోగలిగితే సొసైటీలో ప్రియాంక లాంటి బాధితులు ఉండరు కదా అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. తేజ్ ఒపీనియన్ పట్ల నెటిజన్లు కూడా బాగా చెప్పారు, ఆడవారి పట్ల అందరూ భాద్యతగా ఉండాలని రెస్పాండ్ అవుతున్నారు.
