మెగా హీరో సాయి తేజ్ చేసున్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇన్నాళ్లు యూత్ ఫుల్ ఎంటెర్టైనర్లు చేస్తూ వచ్చిన సాయి తేజ్ మొదటిసారి చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ‘ప్రస్థానం’ లాంటి డెప్త్ ఉన్న సినిమా చేసిన దేవ కట్ట ఈ సినిమాకు దర్శకుడు. రాజకీయం, ప్రజాస్వామ్యం, ప్రజలు లాంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 74 ఏళ్లు అవుతుంది. డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు మనకు అంటూ హీరో చేసే పోరాటమే సినిమా కథ.
ఫస్ట్ లుక్స్, ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఏప్రిల్ 5న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించారు. జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ఒక కీ రోల్ చేస్తుండగా ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తేజ్ తొలిసారి రొమాంటిక్, కమర్షియల్ జానర్లను పక్కనబెట్టి చేస్తున్న సబ్జెక్ట్ కావడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.
