విజయ్ సరసన కబాలి భామ…!

Published on Aug 13, 2019 12:52 pm IST

టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి తాజాగా నటిస్తున్న తమిళ చిత్రం “లాభం”. దర్శకుడు ఎస్ పి జననాధన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మొదటిసారి శృతి హాసన్, విజయ్ కి జోడిగా నటిస్తున్నారు. బాగా పెరిగిన జులపాలతో విభిన్నంగా ఉన్న విజయ్ లుక్ ఒకటి ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

కాగా ఈ మూవీలో మరో హీరోయిన్ గా సాయి ధన్సిక విజయ్ కు జోడిగా నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడటం జరిగింది. సాయి ధన్సిక గతంలో రజని హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కబాలి’ చిత్రంలో ఆయన కూతురి పాత్రలో కనిపించారు. లేడీ గ్యాంగ్ స్టర్ గా సాయి ధన్సిక ఆ చిత్రంలో ఆకట్టుకున్నారు. విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్, 7సీస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుంగా, డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :