సాయిధరమ్ తేజ్ మూవీ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల

మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని చెప్పాలి. ఆయన చివరి హిట్ సుప్రీమ్ తరువాత ఇప్పటివరకు ఆయనకు సరైన విజయం లభించలేదు. తిక్క, జవాన్, విన్నర్, ఇంటెలిజెంట్ సినిమాలతో ఢీలాపడ్డ సాయిధరమ్ ప్రస్తుతం ఆయన మావయ్య పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ వంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన కరుణాకరన్ ను నమ్ముకున్నాడు. అదీకాక గత కొద్దికాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా వున్నా క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

పైగా ఈ సినిమా విజయం సాయి తో పాటు కరుణాకరన్ కు కూడా చాలా అవసరమనే చెప్పాలి. ఆయన నితిన్ తో ఇటీవల చేసిన చిన్నదానా నీకోసం ఘోర పరాయజయం పాలయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఒక ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా, గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు…..

Exit mobile version