ప్రీ లుక్ తో ‘ప్రతి రోజు పండగే’ !

Published on Sep 10, 2019 12:03 pm IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాబోతున్న “ప్రతి రోజు పండగే” చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరువుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి చిత్రబృందం ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. చేతిలో చేయి వేసి ఉన్న ఈ ప్రీ లుక్ లో ఓ పల్లెటూరి నేపథ్యాన్ని కూడా బాగా ఎలివేట్ చేసారు. అయితే రేపు రాత్రి ఎనిమిది గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇక క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

“ప్రతి రోజు పండగే” చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు

సంబంధిత సమాచారం :

X
More