హైద‌రాబాద్ ప్రంపంచం లోనే అత్యుత్తమ సిటీగా నిల‌వాలి – సాయికిర‌ణ్ యాద‌వ్ !

హైద‌రాబాద్ ప్రంపంచం లోనే అత్యుత్తమ సిటీగా నిల‌వాలి – సాయికిర‌ణ్ యాద‌వ్ !

Published on Apr 4, 2019 3:14 AM IST

event1

మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ కుమారుడు సాయికిర‌ణ్ యాద‌వ్ మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్లోని పార్క్‌ హ‌య‌త్ లో నిన్న సాయంత్రం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టాలీవుడ్ కి చెందిన జెమిని కిర‌ణ్‌, దిల్ రాజు, శ‌ర‌త్ మ‌రార్‌, శ్రీ‌క‌ల్యాణ్, రాధా మోహ‌న్, న‌టి హేమ త‌దిత‌రులు హాజరయ్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో అతిధులు మాట్లాడుతూ.. సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ సినీప‌రిశ్ర‌మ‌కు ఎంతో చేశారు. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడు సాయికిర‌ణ్ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు ఎంతో కాలంగా సుప‌రిచితుడు. ప్ర‌జా సేవ చేయ‌డం కోసం చాలా చిన్న వ‌య‌సులో ఎంపీగా పోటీ చేస్తున్నారు. అత‌డు త‌ప్ప‌నిస‌రిగా విజేత‌గా నిలుస్తారు..అని ప‌రిశ్ర‌మ త‌ర‌పున ఆశీస్సులు అందించారు.

యువ నాయ‌కుడు సాయికిర‌ణ్ యాద‌వ్ మాట్లాడుతూ – నాన్న‌గారు నాలుగు సార్లు మంత్రి అయ్యారు. నేను కూడా నాన్న‌గారిలా ప్ర‌జా సేవ‌లో నిమగ్న‌మ‌వ్వాల‌ని ఉంది. అలాగే హైద‌రాబాద్ పేరును అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టేలా ఇత‌ర దేశాల మెట్రో న‌గ‌రాల‌కు త‌ల‌మానికంగా, వ‌ర‌ల్డ్ ది బెస్ట్ గా నిలిచేలా అభివృద్ధి చేయాల‌న్న‌ త‌ప‌న నాలో ఉంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు హైద‌రాబాద్ కి ఎంతో చేశారు. క‌రెంట్ స‌మ‌స్య‌, నీళ్ల స‌మ‌స్య లేకుండా చేయ‌గ‌లిగారు. ట్రాఫిక్ ప‌ర‌మైన సమ‌స్య‌లు లేకుండా
అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకున్నారు. నిరంత‌రం ప్ర‌జా సేవ‌లో ఉండాల‌ని ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాను. ఓట‌ర్ల‌ దీవెన‌లు కావాలి అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు