మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. సీనియర్ నటి రమ్య కృష్ణ శైలజా రెడ్డి పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగష్టు 31న విడుదలకానుంది. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ‘మహానుభావుడు’ చిత్రంతో మారుతీ సక్సెస్ ట్రాక్ లో ఉండడం అలాగే దాదాపు ఏడాది గ్యాప్ తరువాత నాగ చైతన్య ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.


