శైలజారెడ్డి అల్లుడు కు ఏది కలిసి రావడం లేదు !
Published on Aug 29, 2018 6:43 pm IST

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి ఏది కలిసి రావడం లేదు. ఈచిత్రం ఆగస్టు 31 న విడుదలకావాల్సి ఉండగా ఇటీవల కేరళలో వరదల కారణంగా చిత్ర రి రికార్డింగ్ పనులు ఆలస్యమయ్యాయి. ఆ ప్రభావం కాస్త రిలీజ్ డేట్ మీద పడింది. దాంతో ఈ చిత్రాన్ని సమంత నటించిన ‘యు టర్న్’ చిత్రం తో సెప్టెంబర్ 13న వినాయకచవితి రోజు విడుదలచేయాల్సి వస్తుంది.

ఇక ఈ రోజు ట్రైలర్ తోనైనా అభిమానులను సప్రైజ్ చేద్దాం అనుకుంటే అది కాస్త వాయిదా పడింది. నందమూరి హరికృష్ణ ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారణంగా ట్రైలర్ ఈరోజు విడుదల చేయట్లేదని త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook