హిట్-4 పై శైలేష్ కొలను అప్డేట్.. నానిదే ఆలస్యం..!

హిట్-4 పై శైలేష్ కొలను అప్డేట్.. నానిదే ఆలస్యం..!

Published on Nov 29, 2026 1:04 AM IST

Sailesh-Kolanu

సక్సెస్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి నాలుగో భాగం ‘హిట్ 4’ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడు శైలేష్ కొలను ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘హిట్ 4’ స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా సిద్ధమైందని, ఇప్పుడు కేవలం నేచురల్ స్టార్ నానికి కథ వినిపించడం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన వెల్లడించారు.

నాని సమర్పణలో రూపొందుతున్న ఈ ఫ్రాంచైజీలో గత మూడు భాగాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ‘హిట్ 3’ లో నాని స్వయంగా హీరోగా నటించడంతో ఆ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ‘హిట్ 4’ స్క్రిప్ట్ కూడా పూర్తయిందని శైలేష్ కొలను ప్రకటించడంతో, ఈ సినిమా కోసం అప్పుడే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ ఫ్రాంచైజీలోని నాలుగో భాగంలో తమిళ హీరో కార్తీ లీడ్ రోల్‌లో నటించబోతున్నట్లు హిట్-3లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి హిట్-4 గురించి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు