సమీక్ష : సకల కళా వల్లభుడు – ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా

Published on Feb 2, 2019 3:28 am IST
Sakalakalavallabhudu movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 01, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : తనిష్క్ రెడ్డి , మేఘాల ముక్త , చిన్నా , సుమన్

దర్శకత్వం : శివ గణేష్

సంగీతం : అజయ్

తనిష్క్ రెడ్డి , మేఘాల ముక్త జంటగా శివ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సకల కళా వల్లభుడు. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

తనిష్క్(తనిష్క్ రెడ్డి), చైత్ర (మేఘాల ముక్తా) తో తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే చైత్ర కు అతని ప్రవర్తన నచ్చక దూరం పెడుతుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా చైత్ర కిడ్నాప్ కు గురి కాబడుతుంది. ఇంతకీ ఈ చైత్ర ఎవరు? ఆమెను ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆమె గతం ఏమిటి ? తనిష్క్ ఆమె ను ఎలా కాపాడుతాడు అనే విషయాలు తెలియాలంటే ఈచిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సుదీర్ఘకాలం తర్వాత నటుడు చిన్నాకు ఈ చిత్రం ద్వారా ఒక మంచి పాత్ర దొరికింది. ఆయన తన కామెడీ టైమింగ్ తో ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ నవ్వించారు. హీరో తనిష్క్ రెడ్డి పర్వాలేదనిపించాడు అయితే నటన పరంగా ఇంకా చాలా మెరుగవ్వాలి.

హీరోయిన్ మేఘాల బాగానే నటించింది కాని సినిమాలో ఆమె పెద్దగా స్కోప్ లేదు అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు హీరోయిన్ కిడ్నాప్ కు గురైన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇక జబర్దస్ ఫేమ్ రాము మరియు అతని స్నేహితులు హీరో కి సపోర్ట్ చేసే పాత్రలో చాలా బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

హీరో పాత్రను ను ఎస్టాబిలేష్ చేసిన విధానం బాగుంది కాని తరువాత వచ్చే సన్నివేశాలతో సినిమా గ్రాఫ్ పడిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంత కథలేకుండా నడిపించి చాలా బోర్ కొట్టించాడు దర్శకుడు అలాగే హీరో , హీరోయిన్ ను ఏడిపించే సన్నివేశాలు కూడా చాలా సిల్లీ గా అనిపిస్తాయి.

అయితే బ్రేక్ తరువాత సినిమా కొంచెం ఆసక్తికరంగా సాగినప్పటికీ తరువాత ఆ ఇంట్రెస్ట్ ను పోగొట్టడానికి ఎంతో సమయం తీసుకోలేదు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లాగానే సెకండ్ హాఫ్ కూడా విసుగుతెప్పిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ ను కాపాడడానికి హీరో చేసే ట్రిక్స్ సిల్లీగా ఉంటాయి.

ఇక ప్రముఖ కమెడియన్ పృథ్విరాజ్ , జీవ పాత్రలు సినిమాలో విసుగుతెప్పిస్తాయి. అంత సిల్లీ పాత్రలను వారిద్దరూ ఎలా ఒప్పుకున్నారో అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే విలేజ్ నేపథ్యంలో విజువల్స్ బాగున్నాయి. అజయ్ సంగీతం, నేపథ్య సంగీతం డీసెంట్ గా వుంది. ఇక డైరెక్టర్ శివ గణేష్ విషయానికి వస్తే దర్శకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సిల్లీ గా అనిపించే సన్నివేశాలతో స్టోరీ లేకుండా సినిమాని పేలవంగా మార్చేశాడు. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ అలాగే రొమాంటిక్ ట్రాక్ మీద శ్రద్ద పెడితే సినిమా ఉన్నంతలో పర్వాలేదనిపించేది.

తీర్పు :

రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సకల కళా వల్లభుడు చాలా చోట్ల నిరాశ పరుస్తాడు. సినిమాలో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్ అవ్వగా సీరియస్ నెస్ లేకపోవడం సినిమాకు మైనస్ గా చెప్పవచ్చు అలాగే సిల్లీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా విసిగిస్తాయి. చివరగా ఈ చిత్రానికి దూరంగా ఉండడమే మంచింది.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :