పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ఫౌజీ, స్పిరిట్ చిత్రాల షూటింగ్ జరుగుతున్నాయి. వీటి తర్వాత కూడా ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెట్టాడు. వాటిలో ‘కల్కి 2’ చిత్రంతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్ 2’(Salaar 2) కూడా ఉంది.
అయితే, ‘సలార్ 2’ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు పూర్తయ్యాక, ‘కల్కి 2’ చిత్రంపై ఫోకస్ చేయనున్నాడట. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి టాప్ స్టార్స్ ఉండటం.. ఇప్పటికే వారు డేట్స్ కేటాయించడంతో ఆ చిత్రాన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని మేకర్స్ చూస్తున్నారు. దీనికి ప్రభాస్ కూడా ఓకే అనేశాడట.
ఇక ‘సలార్ 2’ను ఆ తర్వాత ప్రారంభించే ఛాన్స్ ఉంది. అటు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్తో మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మరో హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి ‘సలార్ 2’ మూవీ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేకపోవడంతో మరింత ఆలస్యం కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.


