వరల్డ్ వైడ్ “సలార్” కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.!

వరల్డ్ వైడ్ “సలార్” కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.!

Published on Dec 23, 2023 3:03 PM IST

salaar 18

ఈ ఏడాది అన్ని సినీ ఇండస్ట్రీస్ నుంచి పలు భారీ చిత్రాలు డెలివర్ అయ్యాయి. అయితే ఒక్క మన టాలీవుడ్ నుంచి మాత్రం ఆ లోటు ఉండగా దానిని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం “సలార్” తీర్చేసింది అని చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ వచ్చి ప్రభాస్ కెరీర్ లో మాస్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ డే నాడు అయితే వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఆల్రెడీ నైజాంలో నాన్ RRR రికార్డ్స్ సెట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ తో ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచినట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. దీంతో మరి ఈ సినిమా టాలీవుడ్ లో టాప్ 3 హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ వీకెండ్ సహా లాంగ్ రన్ లో వసూళ్లు ఎలా అంతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

తాజా వార్తలు