ఐదురోజులలో పెళ్లనగా…క్యాన్సిల్ చేసిన సల్మాన్ ఖాన్

Published on Oct 24, 2019 12:38 am IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. యాభై ఏళ్ళు దాటినా ఈ కండల వీరుడు పెళ్లి మాట ఎత్తడం లేదు. గత రెండు దశాబ్దాలుగా సల్మాన్ పెళ్లి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గానే కొనసాగుతుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత సాజిద్ నడియావాలా సల్మాన్ పెళ్లి విషయంపై ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. 1999లో సల్మాన్ పెళ్ళికి సిద్దమయ్యారట. నవంబర్ 18 సల్మాన్ తండ్రి గారి పుట్టినరోజు కావడంతో ఆరోజు పెళ్లి ముహూర్తం గా ఖరారు చేసి కార్డ్స్ కూడా ప్రింట్ చేయించారట. ఇంకా కేవలం ఐదురోజులలో పెళ్లనగా, సల్మాన్ నాకు ఆసక్తి లేదని క్యాన్సిల్ చేయించారట.

ప్రముఖ టాక్ షో కపిల్ షో లో సాజిద్ ఈ ఆసక్తికర విషయం పంచుకున్నారు. సాజిద్ పెళ్లి రోజుకూడా వేదికపైకి వచ్చిన సల్మాన్ ‘బయట కార్ ఉంది, గుట్టుగా పారిపో’ అని చెవిలో చెప్పాడట. మరి సల్మాన్ ఎవరితో పెళ్ళికి సిద్దమై, ఆగిపోయారు అనే విషయం ఈ నిర్మాత చెప్పకపోవడం గమనార్హం. ఐతే గతంలో సల్మాన్ సంగీత బిజిలానీ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని సాజిద్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ సల్మాన్ కత్రినా ఖైఫ్, సింగర్ ఇలియా వంతర్ తో రిలషన్ లో ఉన్నారని వినికిడి.

సంబంధిత సమాచారం :

X
More