టీం ఇండియా విజయం పై సల్మాన్ ట్వీట్

Published on Jun 17, 2019 9:02 am IST

నిన్న దాయాది దేశం పాకిస్తాన్ పై ఇండియా సాధించిన ఘనవిజయానికి దేశవ్యాప్తంగా టీం ఇండియా సభ్యులపై అభినందనలు వెల్లువెత్తున్నతున్నాయి. క్రీడారంగానికి చెందిన, అలాగే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మాధ్యమాల ద్వారా తమతమ స్పందనలు తెలియజేస్తున్నారు.బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టీం ఇండియా సాధించిన విజయం పై స్పందించారు. “భారత్ టీం కి ‘భారత్’ తరపున అభినందనలు” అని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇటీవల రంజాన్ సందర్భంగా విడుదలైన సల్మాన్ మూవీ “భారత్” రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది.

రోహిత్ శర్మ భారీ శతకంతో పాటు కుల్దీప్ యాదవ్,హార్దిక్ పాండ్య ల అద్భుత బౌలింగ్ భారత్ కు మరో చరిత్రాత్మక విజయం కట్టబెట్టింది. 1996 నుండి 2019 వరకు వరుసగా జరిగిన ఏడు వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇండియా పాకిస్తాన్ పై గెలవడం మరో విశేషం.

సంబంధిత సమాచారం :

X
More