చిరు, వెంకీ, చరణ్ లకు సల్మాన్ ఆహ్వానం

చిరు, వెంకీ, చరణ్ లకు సల్మాన్ ఆహ్వానం

Published on Nov 17, 2014 8:53 AM IST

salman-khan
బాలీవుడ్ కింగ్ ఖాన్ అయిన సల్మాన్ ఖాన్ సిస్టర్ అర్పిత పెళ్లి ఈ రోజు హైదరబాద్ లో జరగనుంది. ఈ వేడుకకి హైదరబాద్ ఓల్డ్ సిటీలోని ఫలఖ్ నామా ప్యాలెస్ వేదికైంది. ఈ పెళ్ళికి ఇండియాలోని చాలా మంది ప్రముఖులు హాజరుకానున్నారు. సల్మాన్ ఖాన్ సుమారు 250 మంది లిమిటెడ్ సెలబ్రిటీస్ ని మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించారు.

సల్మాన్ ఖాన్ తన సిస్టర్ వివాహానికి హైదరాబాద్ నుంచి నలుగురిని మాత్రమే ఆహ్వానించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ మరియు పింకీ రెడ్డిలు మాత్రమే ఉన్నారు. సల్మాన్ ఖాన్ కి ఇక్కడి స్టార్స్, సెలబ్రిటీస్ చాలా మంది తెలిసినప్పటికీ ఆయన అందరినీ పెళ్ళికి ఆహ్వానించలేదు. ఉదయం నుంచి పలు కార్యక్రామలతో మొదలయ్యే ఈ పెళ్లి సందడి రాత్రి పెళ్లి కార్యక్రమాలతో ముగుస్తుంది.

ఈ ఫలఖ్ నామా ప్యాలెస్ కి రోజుకు కోటి రూపాయలు రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఈ పెళ్ళికి వచ్చే అతిధుల కోసం ఫేమస్ హైదరబాద్ బిర్యానీతో పాటు హలీమ్ లాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా ఉండేలా సల్మాన్ ప్లాన్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు