చరణ్, చిరులకు సల్మాన్ ఖాన్ బెస్ట్ విషెస్

Published on Sep 19, 2019 7:37 pm IST

మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘సైరా’ యొక్క ట్రైలర్ కు సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తున్నాయి. తెలుగు పరిశ్రమ నుండే కాక తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో కూడా మంచి సపోర్ట్ లభించింది. ఇక హిందీ ఇండస్ట్రీ నుండి కూడా అదే స్థాయి మద్దతు దొరుకుతోంది.

రూ.270 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాను హిందీలో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. అందుకే చిరు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేరుగా ట్రైలర్ లింక్ ట్వీట్ చేసి చరణ్, చిరులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇది సినిమాను హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే అవకాశం ఉంది.

ఇక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎలాగూ ఉన్నారు. అలాగే సినిమా మీద హైప్ గట్టిగానే ఉంది కాబట్టి ఓపెనింగ్స్ భారీ స్థాయిలోనే ఉండనున్నాయి. అక్టోబర్ 2న విడుదలకానున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X