తాత్కాలిక బెయిల్ తో బయటపడ్డ సల్లు భాయ్

తాత్కాలిక బెయిల్ తో బయటపడ్డ సల్లు భాయ్

Published on May 6, 2015 6:10 PM IST

salman-khan-bail

ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త… బాలీవుడ్ కింగ్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు ఫైనల్ హియరింగ్, తర్వాత నేర నిరూపణ, ఆ తర్వాత ఐదేళ్ళ జైలు శిక్ష.. ఈ వార్త దేశంలోని ఎంతో మంది సల్మాన్ ఖాన్ అభిమానులను మాత్రమే కాకుండా, సినీ ప్రముఖులను కూడా కలవరపరిచింది. ఉదయం నుంచే బిల్ కోసం ట్రై చేస్తున్న సల్మాన్ ఖాన్ కి పూర్తి ఊరట కలగకపోయినా రెండు రోజుల తాత్కాలిక బెయిల్ తో ఈ రోజుటికి బయటపడ్డాడు.

మధ్యాహ్నం సెషన్స్ కోర్టులో సల్మాన్ నేర నిరూపణ పూర్తయిన కొద్ది సేపటికి సల్మాన్ ఖాన్ కి ఐదేళ్ళు జైలు శిక్ష వేసారు. అక్కడి నుంచి హాయ్ కోర్టుకు వెళ్లి బెయిల్ అప్లై చేసారు కానీ సెషన్స్ కోర్టు నుంచి జడ్జిమెంట్ ఫైనల్ కాపీ అందకపోవడంతో సల్మాన్ ఖాన్ కి హాయ్ కోర్టు రెండు రోజుల తాత్కాలిక బెయిల్ ని మాత్రమే మంజూరు చేసి ఫైనల్ తీర్పుని శుక్రవారంకి వాయిదా వేసింది. శుక్రవారం రోజున సల్మాన్ భాయ్ కి ఐదేళ్ళు శిక్ష పడాల్సిందేనా.? లేక శిక్ష తగ్గడం గానీ అనే విషయాలు తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.

సల్మాన్ ఖాన్ 2002 సెప్టెంబర్ 28న మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. ఆ యాక్సిడెంట్ వలన ఒకరు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. తాగి డ్రైవ్ చేసి ఒకరి ప్రాణం పోవడానికి కారణం కావడం వలనే సల్మాన్ ఖాన్ ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సి వస్తోంది.

తాజా వార్తలు