వివాదంలో చిక్కుకున్న సల్మాన్ ఖాన్ “భరత్”

Published on May 31, 2019 9:00 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం రంజాన్ కి ఓ మూవీ విడుదల చేస్తారు. గతం లో రంజాన్ కానుకగా వచ్చిన సల్మాన్ మూవీస్ బాక్స్ ఫీస్ రికార్డులను తిరగరాసాయి. అలాగే ఈ రంజాన్ కి “భరత్” అనే క్రేజి మూవీని విడుదలకు సిద్ధం చేశారు. జూన్ 5న విడుదల కానున్న ఈ మూవీ ప్రస్తుతం చిన్న వివాదంలో చిక్కుకుంది.

ఢిల్లీకి చెందిన విపిన్ త్యాగి అనే ఓ వ్యక్తి ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరం తెలుపుతూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ సినిమాకు “భరత్” అనే పేరు పెట్టడం నిబంధనలకు విరుద్ధం అని, వెంటనే మూవీ టైటిల్ మార్చివేయాలని ఆయన వాదన. మరి ఈ పిటిషన్ పై కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సల్మాన్ కి జోడిగా కత్రినా ఖైఫ్ నటించిన ఈ మూవీకి అలీ అబ్బాస్ జఫ్ఫార్ దర్శకత్వం వహించగా, రీల్ లైఫ్ ఫిలిమ్స్, సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్,టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More