సల్మాన్ దృష్టిలో సూపర్ స్టార్స్ అంటే ఆ ఐదుగురే

సల్మాన్ దృష్టిలో సూపర్ స్టార్స్ అంటే ఆ ఐదుగురే

Published on Jul 13, 2019 10:59 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ హీరోల స్టార్ డమ్ పై ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ లో నాకు తెలిసి బాలీవుడ్ లో ప్రస్తుతం ఐదుగురు సూపర్ స్టార్స్ ఉన్నారు. అది నేను,షారుక్,అమిర్,అక్షయ్ అలాగే అజయ్ దేవగణ్. స్టార్ డమ్ అనేది చాలా కాలం కొనసాగించడం అనేది చాలా కష్టం తో కూడుకున్నది, మేము ఆ స్టార్ డమ్ కొనసాగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఐతే స్టార్ ల ప్రస్తావనలో నేటి యంగ్ హీరోస్ అయిన రణ్వీర్ సింగ్,హృతిక్,రణ్వీర్ కపూర్ వంటి స్టార్ ల పేర్లు పరిగణలోనికి తీసుకోకపోవడం గమనార్హం.

సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కనున్న “దబాంగ్3″లో నటిస్తున్నారు. అలాగే సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఇన్షాల్లా” చిత్ర షూటింగ్ కూడా త్వరలో మొదలు కానుంది. సల్మాన్ సరసన అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు