స్టేషన్ మాస్టర్ గా మారిన సల్మాన్…ఎందుకంటే…!

Published on Aug 20, 2019 9:54 pm IST

ఖాన్ త్రయంలో సల్మాన్ బ్యాక్ టుబ్యాక్ హిట్ మూవీస్ తో పాటు, ప్రముఖ కంపెనీల ప్రచార కర్తగా, టీవీ హోస్ట్ గా వాయువేగంతో దూసుకుపోతున్నారు. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ వ్యాఖ్యాతగా కూడా ఆయన చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ బిగ్ బాస్ షో మొదటి సీజన్ 2006లో మొదలవగా హోస్ట్ గా హీరో అర్షద్ వార్షి చేశారు. ఆతరువాత నటి శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్ రెండు సీజన్స్ కి హోస్ట్స్ గా వ్యవహరించడం జరిగింది.
ఇక 2010 లో నాలుగవ సీజన్ హోస్ట్ గా ఎంటరైన సల్మాన్ ఖాన్ గత 12 వ సీజన్ వరకు అప్రతిహతంగా నడుపుకుంటూ వస్తున్నాడు.

కాగా బిగ్ బాస్ 13వ సీజన్ కొద్ది రోజులలో మొదలు కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రమో చిత్రీకరించడం జరిగింది. ఆ ప్రమో కొరకు సల్మాన్ ఇలా స్టేషన్ మాస్టర్ వేషం కట్టారన్న మాట. సల్మాన్ మూవీస్ కంటే కూడా బిగ్ బాస్ హోస్ట్ గా ఎక్కువ సంపాదన ఆర్జిస్తున్నాడు. వారాంతం రెండు రోజులకు గాను 30 కోట్లు తీసుకుంటున్న సల్మాన్ బిగ్ బాస్ ఒక సీజన్ మొత్తం ద్వారా 400కోట్ల సంపాదని గడిస్తున్నాడని వినికిడి.

సంబంధిత సమాచారం :