ఈ గొప్ప ప్రయత్నానికి జోహార్ – మహేష్ బాబు

Published on Aug 19, 2018 12:04 pm IST

కేరళలో వరద బీభత్సానికి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. వారి బాధకి అన్ని సినీరంగాల ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. కాగా చుట్టూ పొంచి ఉన్న వరద నీరు, సరైన ఆహారం వసతి లేని పరిస్థితిలో, ఇంకా ఎలాంటి ముప్పు వస్తుందోననే భయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కాగా వెంటనే ప్రజలకు తక్షణ సహాయం చెయ్యటానికి కేరళ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోంది, ఇప్పటికే భారత త్రివిధ దళాలను మోహరించింది. దాంతో సహాయక బృందాలు హెలికాఫ్టర్ల సహాయంతో ప్రజలను ముంపు ప్రాంతాల నుండి తరిలిస్తున్నారు.

కాగా కేరళ ప్రభుత్వం చేస్తున్న వరద భాదితుల రక్షణ కార్యాక్రమాల పై తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘భారత త్రివిధ దళాలకు, సహాయక బృందాలకు సెల్యూట్’ అని పోస్ట్ చేస్తూ.. ప్రజల రక్షణార్థం ఎంతో చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నానికి జోహార్ అని తెలుపారు.

సంబంధిత సమాచారం :

X
More