గత నెల 27న యూట్యూబ్ వేదికగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల అలవైకుంఠపురంలో చిత్రం నుండి ‘సామజవరగమనా….’ అనే మెలోడీ సాంగ్ విడుదల చేయడం జరిగింది. థమన్ స్వర కల్పనలో సిరివెనెల సాహిత్యం అందించిన ఆ పాటను యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. మ్యూజిక్ కాన్సర్ట్ లా చిత్రీకరించిన ఆ వీడియో యూట్యూబ్ లో సంచలనాలు చేస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియో 30మిలియన్ వ్యూస్ సాధించింది.
వెస్ట్రన్ బీట్ కి క్లాసిక్ టచ్ ఇచ్చి అద్భుతంగా థమన్ స్వరపరచడంతో మంచి స్పందన దక్కించుకుంటుంది. కాగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుండి దసరా కానుకగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. బన్నీ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్ ఇతర కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
