టీజర్: “ఓ బేబీ”-70ఏళ్ల సమంత మానసిక సంఘర్షణ.

Published on Jun 20, 2019 10:45 am IST

లేడి డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “ఓ బేబీ”. కొరియన్ మూవీ “మిస్ గ్రాని”కి అనువాదంగా తెలుగు,తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ల యువతి 70ఏళ్ల వృద్ధురాలిగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అనే అంశాలు ప్రధానంగా ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా సురేష్ ప్రొడక్షన్స్,గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదుదలైన చిత్ర టీజర్, ప్రోమో సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

జులై 5న విడుదల కానున్న “ఓ బేబీ” ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేశారు.పూర్తి వైవిద్యం అనిపించిన ట్రైలర్ స్టార్టింగ్ నుండి చివరి వరకు సమంత షోతో నిండిపోయింది. 70ఏళ్ల వృద్ధురాలి మనసు నిండిన 24ఏళ్ల సమంత శరీరం ప్రవర్తించే తీరుతో తన చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు. నానమ్మ ఆత్మ ఉన్న సమంత ప్రేమలో పడే యువకుడిగా తేజా సజ్జ నటిస్తున్నారు. 24 ఏళ్ల యువతి ప్రేమకోసం ప్రయాస పడే వృద్దుడిగా రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది.

ఓ గాయని గా మంచి భర్త, అందమైన జీవితం కోరుకొనే సమంత జీవితంలోకి వృద్ధురాలు ఎలా? ఎందుకు ప్రవేశించింది? దానివలన సమంత జీవితంలో ఏర్పడిన పరిణామాలేమిటి? అనేది ప్రధాన కథాంశం అనితెలుస్తుంది. సమంత సరసన నాగ శౌర్య నటిస్తుండగా,లక్ష్మీ,రావు రమేష్,రాజేంద్ర ప్రసాద్,జగపతిబాబు,అడవి శేషు,తేజా,ఊర్వశి,ధన్రాజ్, ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం మిక్కిజె మేయర్ అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More