సమంత న్యూ అవతార్ “ఓ బేబీ” టీజర్ నేడే

సమంత న్యూ అవతార్ “ఓ బేబీ” టీజర్ నేడే

Published on May 25, 2019 11:03 AM IST

సమంత నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం “ఓ బేబీ”. సౌత్ కొరియన్ మూవీ “మిస్ గ్రాని” కి అనువాదమైన ఈ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు. 70ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే ఫాంటసీ కామెడీ జోనర్లో ఈ మూవీ వస్తుంది.

ఈ రోజు సాయంత్రం 4:00 గం . లకు “ఓ బేబీ” టీజర్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. సమంత ను కొత్త అవతార్లో చూడండి అని టాగ్ చేశారు. “ఓ బేబీ” లో సమంత పాత్ర ఎలా ఉండబోతుందనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది.

సమంత తో పాటు సీనియర్ నటి లక్ష్మీ, రావురమేష్ , రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న ఈ మూవీకి స్వరాలు మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు