మంచివే చేయాలి లేకుంటే ఇంట్లో కూర్చోవాలి : సమంత

మంచివే చేయాలి లేకుంటే ఇంట్లో కూర్చోవాలి : సమంత

Published on Jun 6, 2019 10:10 PM IST

2018 ఆరంభం నుండి సమంత సినిమాలు ఎంపిక పూర్తిగా మారిపోయింది. కథాబలం, పాత్రలకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఆమె చేస్తున్నారు. ఒక్కసారి ఇంత చేంజ్ ఎందుకంటే చేస్తే మంచి సినిమాలే చేయాలి లేకుంటే ఇంట్లో కూర్చోవాలి అని ఆమె గట్టిగా నిర్ణయించుకోవడమేనట. అలా నిర్ణయించుకున్న తర్వాతే ‘రంగస్థలం, సూపర్ డీలక్స్, మహానటి, యుటర్న్, మజిలీ’ చిత్రాలు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపారు.

ఆమె నటించిన కొత్త చిత్రం ‘ఓ బేబీ’. జూలై 5న సినిమా విడుదలకానుంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ సినిమాల నుండి తప్పుకునేలోపు పూర్తి స్థాయి హాస్యభరిత చిత్రం చేయాలనే కోరిక ఉండేది.. అది ఈ చిత్రంతో తీరిపోయిందని సమంత అంటున్నారు. ఇందులో మంచి కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించారు. ఇది కాకుండా సమంత మన్మథుడు 2, 96 తెలుగు రీమేక్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు