ఇండియన్ క్రికెటర్ ధోని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ, సమంత

Published on May 11, 2023 1:03 am IST


యంగ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు కలిసి ప్రస్తుతం నటిస్తోన్న మూవీ ఖుషి. యువ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ లవ్ యాక్షన్ రొమాంటిక్ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. అయితే విషయం ఏమిటంటే, తమ ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ తో తాజాగా విజయ్, సమంత మాట్లాడారు.

ముందుగా సమంత మాట్లాడుతూ ధోని ఒక పర్ఫెక్షనిస్ట్ అని పేర్కొన్నారు మరియు అతను ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండే విధానం గల క్రికెటర్ అని, అలానే అతడు ఎప్పుడూ తనను ఆశ్చర్యపరుస్తుంటారని అన్నారు. ఇక తన అభిమాన క్రికెట్ ప్లేయర్ ధోనీ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. రైల్వే నేపథ్యం నుంచి వచ్చి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా మారిన ధోనీ గొప్ప క్రికెటర్ అని చెప్పాడు విజయ్. మొత్తంగా ధోని గురించి విజయ్, సమంత చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :