చైతు సినిమాలో సమంత క్యాబ్‌ డ్రైవర్‌ అట ?

Published on Jul 11, 2018 5:27 pm IST

తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌ అయిన సరే, ఆమెకు పెళ్లి అయితే ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకుంటారు. కానీ అక్కినేని సమంతకి ఈ నియమం వర్తించదు. ఎందుకంటే పెళ్లి తరువాత కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తున్నారు. త్వరలో ఓ డిఫరెంట్ జానర్‌ లో రూపొందుతున్న యు టర్న్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సమంత.

కాగా, ‘నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమాలో సమంత ఓ క్యాబ్‌ డ్రైవర్‌ గా కనిపించనున్నారని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఈ చిత్రం తెరకెక్కబోతుందట. ఏమైనా తమ పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం

సంబంధిత సమాచారం :