ప్రమోషన్స్ బిజీ లో సమంత !

sam

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ దూసుకుపోతున్న నటి సమంత నటించిన చిత్రం యు టర్న్. ఈచిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ అవుతుంది సమంత. ఇటీవల తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ప్రమోషనల్ వీడియోలో కనబడి చిత్రంఫై అంచనాలను పెంచేసిన సామ్ తాజాగా టి వి చానళ్లకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం తో సామ్ ఆమె భర్త నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం తో బాక్సాఫిస్ వద్ద పోటీ పడనుంది. ఈ రెండు చిత్రాలు వినాయక చవితి రోజున సెప్టెంబర్ 13న విడుదలకానున్నాయి.

Exit mobile version