బిజీ బిజీగా సమంత..!

బిజీ బిజీగా సమంత..!

Published on Jul 24, 2014 12:11 AM IST

SAMANTHA (1)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘రభస’. కొద్ది రోజుల క్రితం పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిన సమంత మంగళవారం హైదరాబాద్ తిరిగొచ్చింది. ఈ రోజుతో ‘రభస’ షూటింగ్ పూర్తయింది. వెంటనే చెన్నై ఫ్లైట్ ఎక్కింది సమంత.

ప్రస్తుతం సమంత రెండు తమిళ సినిమాలలో నటిస్తుంది. విజయ్ – ఏఅర్ మురగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కత్తి’ ఒకటి. విక్రమ్ సరసన విజయ్ మిల్టన్ సరసన నటిస్తున్న సినిమా మరొకటి. ఈ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా మరికొన్ని రోజులు సమంత చెన్నైలో గడపనుంది. మధ్యలో ‘అంజాన్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.

సమంత నటించిన ‘అల్లుడు శీను’ ఈ నెల 25న విడుదల అవుతుంది. తమిళ సినిమాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు