నా సినిమాల్లో కథే హీరో – సమంత

నా సినిమాల్లో కథే హీరో – సమంత

Published on May 11, 2026 2:02 PM IST

samantha

హీరోయిన్ సమంత సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఇదే క్రమంలో ఇటీవల జరిగిన ఓ మ్యాగజైన్‌ కవర్‌ షూటింగ్‌ సమయంలో ఎదురైన ప్రశ్నలకుగానూ సమంత తన పాత్రల ఎంపిక గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. సమంత మాట్లాడుతూ.. ‘నేను చేసే సినిమాల్లో కథే హీరో అవుతుంది. కథ.. నిర్మాత, నటీనటుల కంటే గొప్పది. సమాజంలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలనేది నా భావన’ అని సామ్ తెలిపింది.

సమంత ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమాలు చూస్తున్న మహిళలు ఆ సినిమాల్లోని పాత్రలతో మమేకం అవ్వాలి. తమను కూడా గుర్తించారని వారు భావించేలా అవి ఉండాలి. ఇకపై అలాంటి చిత్రాల్లోనే భాగం కావాలనుకుంటున్నాను. ఇక ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని అత్యంత వినోదాత్మకంగా, కుటుంబం మొత్తం ఆస్వాదించేలా తీర్చిదిద్దాం’’ అని సమంత చెప్పుకొచ్చింది. మరి మా ఇంటి బంగారం సినిమాతో సామ్ ఎలాంటి విజయాన్ని అదుముకుంటుందో చూడాలి.

తాజా వార్తలు