‘సూపర్ డీలక్స్’ షూటింగ్ పూర్తిచేసిన సమంత !

‘సూపర్ డీలక్స్’ షూటింగ్ పూర్తిచేసిన సమంత !

Published on Jun 12, 2018 7:00 PM IST

samantha2

వరుస విజయాలతో తెలుగు , తమిళ బాషలలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి సమంత అక్కినేని. ఈమె తాజాగా తమిళ భాషలో నటిస్తున్న చిత్రం ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తిచేసి చిత్ర టీం తో సెలబ్రేట్ చేసుకుంది సమంత .

విజయ్ సేతుపతి కథానాయకుడుగా నటిస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రమ్య కృష్ణన్ , ఫహద్ ఫాసిల్ , డైరెక్టర్ మిస్కిన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు . త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు . ఈ చిత్రాన్ని సెప్టెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

తాజా వార్తలు