స్వతహాగా తమిళ పొన్ను అయిన అందాల భామ సమంత మొదటి తమిళ సినిమా ఫ్లాప్ గా మిగిలినా తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని జాక్ పాట్ కొట్టేసింది. ఆ ఒక్క సినిమాతో తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో చకచకా సినిమాలు చేసేసింది. కనీ ఈ మధ్య కాలంలో సమంత హవా తమిళంలోనూ ఊపందుకుంది. వరుసగా తమిళ స్టార్ హీరోస్ తో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో చేస్తున్న పలు ప్రాజెక్ట్స్ లో సూర్య సరసన నటిస్తున్న ’24’ కూడా ఒకటి.
ఒకేసారి తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్న ఈ సినిమా తెలుగు రైట్స్ ని నితిన్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాని సూర్య తన సొంత బ్యానర్ అయిన 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కానీ ఈ సినిమాతో సమంత కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అవి వట్టి రూమర్స్ మాత్రమే అని సమంత కొట్టిపారేసింది. ప్రస్తుతం నేను పోలాండ్ లో షూటింగ్ లో బిజీగా ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నా అక్కడ రూమర్స్ ఎల్ వస్తున్నాయో అని నవ్వుకుంటోంది సమంత.
తెలుగులో సమంత మహేష్ బాబు సరసన ‘బ్రహ్మోత్సవం’, నితిన్ సరసన ‘అ.. ఆ’ సినిమాలలో నటించిననుంది. ఇది కాకుండా ఈ ఏడాది పలు తమిళ సినిమాలతో కూడా బిజీగా ఉంది.


