ఫస్ట్ హాఫ్ ముగించేసిన సమంత.. మరి సెకండాఫ్‌ను ‘లెనిన్’ కొనసాగిస్తాడా..?

ఫస్ట్ హాఫ్ ముగించేసిన సమంత.. మరి సెకండాఫ్‌ను ‘లెనిన్’ కొనసాగిస్తాడా..?

Published on Jun 23, 2026 4:06 PM IST

వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న టాలీవుడ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ‘సింగ్ గీతం’ పాజిటివ్ టాక్‌తో మొదలైన మార్పు, సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్‌గా మారింది. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మళ్లీ థియేటర్లకు రప్పించి పరిశ్రమలో కొత్త జోష్ నింపింది. 2026 సంవత్సరంలోని ఫస్ట్ హాఫ్‌ను మంచి సక్సెస్‌తో సామ్ ముగించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఇక ఇప్పుడు అందరి దృష్టి జూలై 10న విడుదల కాబోతున్న అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రంపై పడింది. పరిశ్రమలోకి వచ్చి దశాబ్దం అవుతున్నా అఖిల్ ఇంకా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఇది ఆయన కెరీర్‌కు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. ప్రస్తుతం ఇండస్ట్రీ ఉన్న సానుకూల పరిస్థితులు ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయి.

కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ‘మా ఇంటి బంగారం’ నిరూపించింది. ‘లెనిన్’ మంచి టాక్ తెచ్చుకుంటే అఖిల్ మార్కెట్ స్థిరపడటమే కాకుండా, ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు పెద్ద పండగ అవుతుంది. మరి 2026 సెకండాఫ్‌ను కూడా సక్సెస్‌తో లెనిన్ కొనసాగిస్తాడా లేడా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు