సమంత ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్..!

Published on May 27, 2020 12:27 am IST

టాలీవుడ్ లక్కీ లేడీ అండ్ టాప్ యాక్ట్రెస్ సమంత ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అని మరో మారు రుజువయ్యింది. ఇంస్టాగ్రామ్ లో ఆమె ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 10మిలియన్స్ కి చేరుకుంది. అంటే సమంతను కోటి మంది ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారన్న మాట. ఈ విషయానికి సోషల్ మీడియా వేదికగా సమంత ఆనందం వ్యక్తం చేసింది. యాహూ…10 మిలియన్ ఫాలోయర్స్ అని ఆమె ఓ అద్భుతమైన ఫోటో పోస్ట్ చేసి, కామెంట్ పెట్టారు.

గత ఏడాది ఓ బేబీ తో సోలోగా సాలిడ్ హిట్ అందుకుంది. ఫిక్షనల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె లేటెస్ట్ మూవీ జాను ఆశించినంత విజయం సాధించకపోయినా, ఆమె పాత్రకు ప్రశంశలు దక్కాయి. కాగా సమంత తెలుగులో ఎందుకో కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. ఇక తమిళంలో ఓ మూవీ చేస్తున్న ఈమె, ది ఫామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More